నగరంలో భారీ వర్షం | Sakshi
Sakshi News home page

నగరంలో భారీ వర్షం

Published Tue, Jun 28 2016 3:17 AM

నగరంలో భారీ వర్షం - Sakshi

మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం
 
సాక్షి, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా కోయిదాలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
 
హైదరాబాద్‌లో ఎడతెగని వర్షం
హైదరాబాద్‌లో పలు చోట్ల సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కూకట్‌పల్లి, మియాపూర్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, ఉప్పల్, రామంతాపూర్, తార్నాక, ఈసీఐఎల్, తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. రహదారులపై ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి 10.30 గంటల వరకు బేగంపేటలో 2.7 సెం.మీ.లు, కూకట్‌పల్లిలో 2.8 సెం.మీ, గోల్కొండలో 1.2సెం.మీ.ల వర్షం కురిసినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
 
రాష్ట్రంలో వర్షపాతం వివరాలు (సెంటీమీటర్లలో)
 
 ప్రాంతం          వర్షపాతం
 కోయిదా          18
 ఇబ్రహీంపట్నం    7
 బోథ్                7
 పేరూర్             7
 సత్తుపల్లి           6
 నిర్మల్             6
 మెట్‌పల్లి          4
 బాల్కొండ        4
 సిర్పూర్           3
 

Advertisement

తప్పక చదవండి

Advertisement