Sakshi News home page

హైకోర్టు విభజన ప్రక్రియను వెంటనే చేపట్టాలి: జానా

Published Tue, Jun 28 2016 5:30 PM

High Court Division must be done immediately, says congress leader janareddy

హైదరాబాద్ : హైకోర్టు విభజనలె జాప్యం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని  కాంగ్రెస్ సీఎల్పీ నేత  జానారెడ్డి వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకంలో అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. ఈ మేరకు జానారెడ్డి మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు న్యాయమూర్తుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.

న్యాయమూర్తులపై సస్పెన్షన్ వేయటాన్ని జానారెడ్డి ఖండించారు. న్యాయమూర్తులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే హైకోర్టు విభజనకు తగు చర్యలు చేపట్టాలన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుతో సంప్రదింపులు జరపాలన, అందుకు తమ మద్దతు ఉంటుందని జానారెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement