'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు' | Sakshi
Sakshi News home page

'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు'

Published Mon, Apr 4 2016 12:43 PM

'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు' - Sakshi

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హోర్డింగ్స్, బ్యానర్లు, కటౌట్ల ఏర్పాటుపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా వెలసిన బ్యానర్లు, హోర్డింగ్స్, కటౌట్లను తక్షణమే తొలగించాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. అక్రమ హోర్డింగ్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి అక్రమ హోర్డింగ్స్ లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై  హైకోర్టు సీరియస్గా స్పందించింది.
 
'మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు. అనుమతులు లేకుండా వెలసిన హోర్డింగ్స్పై జన్మదిన శుభాకాంక్షలా?. దీనిపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వండి' అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. కాగా రాజకీయ పక్షాలు తమ పార్టీల నాయకులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆహ్వానాలు పలుకుతూ ఇష్టారాజ్యంగా ఎక్కడ బడితే అక్కడ బ్యానర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేసేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement