‘సినిమా’ పన్నుల వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు | Sakshi
Sakshi News home page

‘సినిమా’ పన్నుల వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు

Published Fri, Mar 17 2017 4:39 AM

high court reacts on division of movies tax

ఆశీర్వాద్‌ ఫిలిమ్స్‌ కేసులో ఉమ్మడి హైకోర్టు తీర్పు  
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పరిధిలో నిర్మించిన చిత్రాలకు ఒక రకమైన పన్ను.. రాష్ట్రం వెలుపల నిర్మించిన చిత్రాలకు మరో రకం పన్ను విధిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో 604ను హైకోర్టు సమర్థించింది. ప్రభుత్వం చేసిన ఈ వర్గీకరణ ఎంత మాత్రం రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమ ణియన్, జస్టిస్‌ జె.ఉమా దేవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సినిమాలు నిర్మించే ప్రాంతాలను బట్టి పన్ను రేట్లను నిర్ణయిస్తూ ఏపీ సర్కార్‌ 200 8 ఏప్రిల్‌ 22న జీవో 604 జారీ చేసింది.

ఏపీ వినోద పన్ను చట్టం కింద కొన్ని విభా గాల్లోని చిత్రాలకు సినిమా థియేటర్లు ఉన్న ప్రాంతాలను బట్టి వినోదపన్ను నుంచి మినహాయింపునిస్తూ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ ఆశీర్వా ద్‌ ఫిలిమ్స్‌ అధినేత రాజన్‌ శర్మ 2011లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తుది విచారణ జరిపిన జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

Advertisement
Advertisement