నగరంలో అడుగడుగునా నిఘా: సీపీ | Sakshi
Sakshi News home page

నగరంలో అడుగడుగునా నిఘా: సీపీ

Published Wed, Aug 30 2017 3:39 PM

High Security for Ganesh Immersion : CP Mahender Reddy

హైదరాబాద్‌: బక్రీద్‌, వినాయకచవితి పండుగల సందర్భంగా 24 వేల మంది పోలీసులతో, వేలాది సీసీ కెమెరాల ద్వారా అణువణువునా పర్యవేక్షిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ మహేందర్‌ రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీతో కలిసి రూట్‌ మ్యాప్‌ చెక్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎక్కడైనా రహదారి సమస్య వస్తే ప్రజలు ముందుగానే తెలియజేయాలని కోరారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి పోలీసు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. రెండు పండగలు ఒకటే సారి వస్తున్నందువల్ల ప్రజలందరూ సహకరించాలని,  అన్నిశాఖల సలహాలు తీసుకుంటామని చెప్పారు.
 
వినాయక ఉత్సవ కమిటీలతో పాటు , అన్ని శాఖల సహకారంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌ రెడ్డి చెప్పారు. నిమజ్జనం రోజున జరిగే కార్యక్రమాలపై ఇప్పటికే అన్ని వసతుల ఏర్పాట్లు చేశామని తెలిపారు. చెత్త వేయడానికి అక్కడక్కడ లక్ష కవర్లను, 168 మంది యాక్షన్ టీమ్‌లను, 5300 మంది జీహెచ్‌ఎంసీ కార్మికులు, 203 వాహనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Advertisement
Advertisement