హైటెక్ సిటీ పరిసరాల్లో ఫ్రీ వైఫై | Sakshi
Sakshi News home page

హైటెక్ సిటీ పరిసరాల్లో ఫ్రీ వైఫై

Published Fri, Oct 10 2014 12:21 PM

హైటెక్ సిటీ పరిసరాల్లో ఫ్రీ వైఫై - Sakshi

హైదరాబాద్ : పైలట్ పబ్లిక్ వైఫై సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది.  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం  వైఫై సేవలను ప్రారంభించారు. దాంతో ఈ సేవలు హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ఏరియాలలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వినియోగదారుడు 750 ఎంబి ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని  వైఫై నగరంగా అభివృద్ధి చేస్తామని, వైఫై సేవలను అందించేందుకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. నగరాన్ని గ్లోబల్ స్మార్ట్ సిటీగా చేయటంలో భాగంగా ఇది తొలి అడుగు అని ఆయన అన్నారు.  వైఫైతో హైదరాబాద్ ఇమేజ్ను పెంచుతామని తెలిపారు. ఐదు నెలల్లో నగరం మొత్తం వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం ఎయిర్ టెల్ సహకారంతో 17 సెంటర్లల్లో ప్రయోగాత్మకంగా వైఫై సేవలు అందిస్తున్నాట్లు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement