ఆ ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వండి | Sakshi
Sakshi News home page

ఆ ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వండి

Published Tue, Dec 27 2016 5:14 AM

ఆ ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వండి - Sakshi

ఏపీఏటీలో కేసుల బదలాయింపు ఆర్డినెన్స్‌పై
కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌:
ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ట్రిబ్యునల్‌ (ఏపీఏటీ) లో తెలంగాణకు సంబంధించిన కేసులన్నింటినీ ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై హైకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివరణ కోరింది. ఇందులో భాగంగా వాటికి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ అంబటి శంకరనారాయణతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల బదలాయింపు ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ కరీంనగర్‌కు చెందిన జయశ్రీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సోమవారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆర్డినెన్స్‌ జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement