మీ ఆశీస్సులు నాకు బలం: వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

మీ ఆశీస్సులు నాకు బలం: వైఎస్‌ జగన్‌

Published Wed, Dec 21 2016 3:08 PM

మీ ఆశీస్సులు నాకు బలం: వైఎస్‌ జగన్‌ - Sakshi

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. మీ ఆశీస్సులు తనకు బలం, స్ఫూర్తి అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బుధవారం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్ కట్ చేసి ప్రియతమ నేత పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు, అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రుల్లో పేషెంట్లకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. మహిళలకు చీరలు, దుప్పట్లు, మిక్సీలు పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వీట్స్ పంచిపెట్టారు.
 

Advertisement
Advertisement