నా కొడుకు ప్రేమ కావాలి... | Sakshi
Sakshi News home page

నా కొడుకు ప్రేమ కావాలి...

Published Tue, Jul 21 2015 9:12 AM

నా కొడుకు ప్రేమ కావాలి... - Sakshi

బంజారాహిల్స్:  అమ్మా.. తిన్నావా? పడుకున్నావా.. ఆరోగ్యం ఎలా ఉంది.. అంటూ ఎప్పుడూ అడిగే తన కొడుకు ఆప్యాయత కరువైంది.  తనకు కొడుకు ప్రేమ కావాలని ఓ వృద్ధురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఈ సమస్యను ఎలా తీర్చాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలు... బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని శ్రీవెంకటేశ్వరనగర్‌లో నివసించే లక్ష్మీబాయికి ఇద్దరు కొడుకులు. ఆరు నెలల క్రితం చిన్నకొడుకు పెళ్లి అయింది.

కొద్ది రోజులుగా కొడుకు ప్రవర్తనలో మార్పు రావడంతో లక్ష్మీబాయి తనపై కొడుకుకు ప్రేమ తగ్గిందని బాధపడుతోంది. ఈ విషయమై పలుమార్లు కొడుకున ప్రశ్నించింది.  మొన్నటి వరకూ తన యోగక్షేమాలు అడిగిన తన బిడ్డ ఇప్పుడు తనకు దూరం కావడంతో మనోవేదనకు గురైన లక్ష్మీబాయి..  తన కొడుకుకు తనపై ప్రేమ తగ్గిందని, కొడుకు ప్రేమ కావాలంటూ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కొడుకును పిలిపించి,ఆమెముందే కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్దరినీ ఇంటికి పంపేశారు.  ఇంత చేసినా ఆ తల్లి మనసు మాత్రం సంతృప్తి చెందలేదు.

Advertisement
Advertisement