పెరిగిన ఓటర్లు 13.61 లక్షలు | Sakshi
Sakshi News home page

పెరిగిన ఓటర్లు 13.61 లక్షలు

Published Thu, Nov 26 2015 12:29 AM

Increased 13.61 lakh voters

సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలోకొత్తగా కొలువుదీరనున్న పాలక మండలి ఎన్నికలకు 13.61 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త వారి చేరికతో కలిపి వచ్చే జనవరిలో జరుగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో దాదాపు 71 లక్షల మంది ఓటర్లు ... 150 మంది స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకోనున్నారు. ఇప్పటి వరకు (అక్టోబర్ 5 వరకు నమోదు చేసుకున్నవారు) ఉన్న ఓటర్లు 70.60 లక్షల మంది. నోటిఫికేషన్ వెలువడే వరకు జాబితాలో పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.

దీంతో ఈ సంఖ్య దాదాపు 71 లక్షలకు పెరగవచ్చునని అంచనా. డివిజన్ల సంఖ్య (150)లో మార్పు లేనప్పటికీ, స్వరూప స్వభావాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. డీలిమిటేషన్‌తో కొన్ని డివిజన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోగా... మరికొన్నిటిలో స్వల్ప మార్పులు జరిగాయి. సగటున 43 వేల మంది ఓటర్లు ఒక్కో ప్రజాప్రతినిధి (కార్పొరేటర్)ని ఎన్నుకోనున్నారు.

2009 అక్టోబర్‌లో జీహెచ్‌ఎంసీ పరిధిలోని
150 డివిజన్ల (వార్డుల)లోని ఓటర్లు : 56,99,015
{పస్తుతం 150 డివిజన్ల
(వార్డుల)లోని ఓటర్లు :70,60,493
గడచిన ఆరేళ్లలో పెరిగిన ఓటర్లు  : 13,61,478
 

Advertisement
Advertisement