మే14 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ | Sakshi
Sakshi News home page

మే14 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

Published Sat, Apr 14 2018 2:53 AM

Intermediate Supplementary from May 14

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను శుక్రవారం ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. మే 14 నుంచి మే 22 వరకు పరీక్షలు నిర్వహించనుంది.

ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యా హ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయం త్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు మే 24 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష మే 29న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష మే 30న నిర్వహిస్తామంది.

పరీక్ష ఫీజును 20లోగా చెల్లించాలి
సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫస్టియర్, సెకండియర్‌ విద్యార్థులు పరీక్ష ఫీజును ఈనెల 20లోగా చెల్లించాలని బోర్డు కార్యదర్శి అశోక్‌ సూచించారు. గడువు తర్వాత అపరాధ రుసుముతో చెల్లించే అవకాశం ఉండదన్నారు. ఫస్టి యర్‌ విద్యార్థులు ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకోవ చ్చని, సాధారణ పరీక్ష ఫీజుకు అదనంగా ఒక్కో సబ్జెక్టుకు రూ.150 చెల్లించాలని చెప్పా రు. ప్రైవేటు విద్యార్థులకు సైతం ఈ నిబంధనలే వర్తిస్తాయని, వారు ఆయా కాలేజీ ప్రిన్సిపాల్స్‌కే ఫీజు చెల్లించాలని వివరించారు.

Advertisement
Advertisement