భూకుంభకోణంపై విచారణ జరపాలి | Sakshi
Sakshi News home page

భూకుంభకోణంపై విచారణ జరపాలి

Published Sun, Jun 18 2017 12:42 AM

భూకుంభకోణంపై విచారణ జరపాలి

ప్రొఫెసర్‌ కోదండరాం
సాక్షి, హైదరాబాద్‌: మియాపూర్‌ భూ కుంభకోణంపై ప్రభుత్వం తగిన చర్య లు తీసుకోకపోతే అన్ని దస్తావేజులతో బహిరంగ విచారణ జరుపుతామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం హెచ్చరించారు. జేఏసీ కోచైర్మన్‌ గోపాలశర్మ అధ్యక్షతన శనివారం ఇక్కడ ‘మియాపూర్‌ భూకుంభ కోణం’పై రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. కోదండరాం మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ప్రభుత్వ మే, సంపన్నులకు అక్రమంగా కట్టబెడుతున్న దన్నారు. కాగితాల్లోనే భూములు మారాయని, ఎక్కడి భూములు అక్కడే ఉన్నాయని సీఎం కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇప్ప టికే ఆ భూముల్లో భారీ విల్లాలు, అపార్టుమెం ట్లను నిర్మించారని, వాటిని బడా బాబులు కొనుక్కున్నట్టు స్థానికులు చెబుతున్నారని అన్నా రు. ఈ భూముల కుంభకోణంలో వాస్త వాలను చెప్పడానికి కరపత్రాలను వేస్తామన్నారు. ప్రభుత్వ భూములపై అధ్యయనం చేసిన ఎస్‌.కె.సిన్హా కమిటీ నివేదికను బయట పెట్టాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. ఇప్పటిదాకా ప్రభు త్వం గుర్తించిన భూముల వివరా లను బయటపెట్టాలని, వాటిని సంరక్షిం చడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

భూముల అక్రమాలపై న్యాయ విచారణ జరిపాలని డిమాండ్‌ చేశారు. సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది దామోదర్‌రావు మాట్లాడుతూ తెలం గాణలో నిజాంకాలం నాటి నుంచి ఉన్న ప్రభుత్వ భూములు, వాటి స్వరూపం గురించి వివరిం చారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రామకృష్ణారెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వ భూమి ఎంత ఉందో ఇప్పటికీ సరైన లెక్కలు లేవన్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో, ఎంత ఉందో తెలుసుకోవడానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. టీజేఏసీ నేతలు భైరి రమేశ్, మాదు సత్యం, పలువురు న్యాయ నిపుణులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement