కార్బైడ్తో పండించడం ఉగ్రవాదం కన్నా ప్రమాదం | Sakshi
Sakshi News home page

కార్బైడ్తో పండించడం ఉగ్రవాదం కన్నా ప్రమాదం

Published Wed, Aug 19 2015 2:48 PM

కార్బైడ్తో పండించడం ఉగ్రవాదం కన్నా ప్రమాదం - Sakshi

పచ్చిగా ఉన్న కాయలను పండ్లుగా మార్చేందుకు కృత్రిమ పద్ధతులు అవలంబించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశాలు ఇచ్చేంతవరకు మీరేం చేస్తున్నారని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది. నిషేధిత కార్బైడ్ లాంటి్ రసాయనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. రసాయనాలతో పండ్లను పండించడం ఉగ్రవాదం కన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. అలా పండించిన పండ్లు ప్రజల ఆరోగ్యానికి హానికరమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కాగా, ఆంధ్రప్రదేశ్లోని పలు పండ్ల మార్కెట్లలో దాడులు చేశామని, ఎక్కడా కార్బైడ్ లాంటి రసాయనాలు వాడినట్లు నిర్ధారణ కాలేదని ఏపీ సర్కారు కోర్టకు తెలిపింది. అయితే.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పలు పండ్ల మార్కెట్లపై దాడులు చేశామని, పెద్ద ఎత్తున కార్బైడ్ను స్వాధీనం చేసుకున్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో సమగ్ర వివరాలతో రెండు వారాల్లోగా ఒక నివేదికను కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement