ట్వీటర్‌లోనైనా మాట్లాడుతున్నా | Sakshi
Sakshi News home page

ట్వీటర్‌లోనైనా మాట్లాడుతున్నా

Published Wed, Feb 1 2017 2:00 AM

ట్వీటర్‌లోనైనా మాట్లాడుతున్నా - Sakshi

  • మన ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నా మాట్లాడటం లేదు
  • జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజం
  • ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీతో కలసి పనిచేయడానికి అభ్యంతరం లేదు
  • సాక్షి, హైదరాబాద్‌:  ప్రత్యేక హోదా విషయం లో తాను కనీసం ట్వీట్టర్‌లోనైనా మాట్లాడు తున్నానని, మన ఎంపీలు పార్లమెంట్‌లో ఉన్నా ఏమీ మాట్లాడటం లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. హోదా సాధించేందుకు అందరూ చిత్తశుద్ధితో పోరాటం చేయాలని కోరారు. తన అను భవం సరిపోదని, ఇతర పార్టీలు ముందు కొస్తే.. తాను కూడా వారితో కలిసి పోరాడు తానన్నారు. అన్ని పార్టీలూ కలసికట్టుగా పోరాడి హోదాను సాధించుకోవాల్సిన అవ సరం ఉందన్నారు. ఆయన మంగళవారం విలేకరు లతో మాట్లాడారు. ఏపీకి హోదా సాధన కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలసి పని చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. రాజకీయ పార్టీల విధివిధానాలు ఎలా ఉన్నా ప్రజా సమస్యలపై కలిసి పోరాడాలని అన్నారు. లోపాలను చాలామంది బహిర్గతం చేసినా ప్రభుత్వం వినకూడదనుకుంటే ఏం చేస్తాం, అందుకే రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని చెప్పారు.

    హోదాపై మొండిగా ఉంటే కుదరదు: రాష్ట్ర విభజన అనేది రాజకీయ వ్యూహమని అర్థం చేసుకోగలమని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో మాట ఇచ్చి.. ఇప్పడు మాత్రం ఇవ్వం అని మొండిగా మాట్లాడితే కుదరదని స్పష్టం చేశారు. ఓట్లు అడగటానికి వచ్చినప్పడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడితే ప్రజలకు విశ్వాసం పోతుందని చెప్పారు.

    బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించాలి: చేనేత సమస్యలను పరిష్కరించి, ఈ కళను సంరక్షించాలన్న ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పద్మశాలి సాధన సంఘం ప్రతినిధులు విమర్శించారు. చేనేత రంగానికి బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 5 లక్షల మంది ఉన్న చేనేత కార్మికులకు మగ్గానికి రూ.10 వేల చొప్పన ఆర్థిక సాయం చేయాలన్నారు.

Advertisement
Advertisement