హేతుబద్ధీకరణతోనే మేలు | Sakshi
Sakshi News home page

హేతుబద్ధీకరణతోనే మేలు

Published Thu, Mar 31 2016 2:52 AM

హేతుబద్ధీకరణతోనే మేలు

విద్యా విధానంపై చర్చలో కడియం
గ్రామ పంచాయతీకి ఒకే ప్రాథమిక పాఠశాల
చుట్టు పక్కల స్కూళ్లను అందులో విలీనం చేస్తాం
విద్యార్థుల రవాణా బాధ్యత ప్రభుత్వానిదే..
త్వరలో డీఎస్సీ ప్రకటన..
వర్సిటీల్లో వీసీలు, చాన్స్‌లర్లను నియమిస్తాం


సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతోనే ఉపయోగమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంచేశారు. ‘‘అసలే విద్యార్థులు లేనివి, 10 మంది, 20 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీలోని గ్రామాలు, జన ఆవాసాలు, తండాల్లో 4,5,10 వరకు ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఈ బడులన్నింటినీ ఒకే ప్రాథమిక పాఠశాల లో విలీనం చేస్తాం. పరిపాలన సౌలభ్యంతో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలు ఉంటారు. బడులను మూసివేసే ప్రయత్నం కాదు.. బడుల సంరక్షణకే ఈ ఆలోచన. చుట్టు పక్కల తండాలు, గ్రామాల నుంచి విద్యార్థులను ప్రాథమిక పాఠశాలకు చేర్చే బాధ్యతలను అవసరమైతే ప్రభుత్వమే తీసుకుంటుంది.

ఆర్టీసీతో మాట్లాడి పాఠశాలల వేళల్లో విద్యార్థులకు రవాణా ఏర్పాట్లు చేస్తుంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుం డానే హేతుబద్ధీకరణ జరుగుతుంది’’ అని ఆయన ప్రకటించారు. విద్యా విధానంపై బుధవారం అసెం బ్లీలో జరిగిన చర్చలో అధికార, విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు కడియం సమాధానమిచ్చారు. త్వ రలో డీఎస్సీని ప్రకటిస్తామన్నారు. ఒక ప్రాథమిక పా ఠశాలలో 100 మంది విద్యార్థులు, ఐదారు మంది ఉపాధ్యాయులు ఉంటేనే బాగుంటుందన్నారు. 6,7వ తరగతులను బోధించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు లేక ఆ పాఠశాలల పరిస్థి తి నిరాశజనకంగా మారిందన్నారు. ప్రాథమికోన్నత బడుల నుంచి 6,7 తరగతులను వేరు చేసి ఉన్నత పాఠశాలలకు బదిలీచేసే ఆలోచన ఉందన్నారు.  

 మూడు నెలల్లో నివేదిక
నూతన విద్యావిధానంపై నిపుణులతో కమిటీ వేసి మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుంటామని కడియం చెప్పారు. విద్యా రంగానికి నిధుల కొరత ఉండదని, అవసరమైతే ప్రత్యేక నిధి నుంచి నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరణను పరిశీలిస్తామని వివరిం చారు. కొత్త ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామన్నారు.   2,753 అధ్యాపకుల పోస్టుల్లో 1,149 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఉస్మానియా వర్సిటీలోని 80 శాతం ప్రొఫెసర్లు 2018 నాటికి పదవీ విరమణ చేస్తారని, ఆలోగా నియామకాలు చేయకపోతే వర్సిటీ న్యాక్ గుర్తింపును సైతం కోల్పోయే ప్రమాదముందన్నారు. త్వరలోనే వర్సిటీల్లో చాన్స్‌లర్లు, వైస్ చాన్స్‌లర్లను నియమిస్తామని చెప్పారు. 2016-17 బడ్జెట్ కేటాయింపుల్లో ప్రణాళిక రంగానికి కేటాయించిన రూ.1,600 కోట్లను ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకే వినియోగిస్తామని కడియం చెప్పారు.

Advertisement
Advertisement