బాబుకు ముందే ఎలా తెలిసింది? | Sakshi
Sakshi News home page

బాబుకు ముందే ఎలా తెలిసింది?

Published Mon, Nov 14 2016 2:06 AM

బాబుకు ముందే ఎలా తెలిసింది? - Sakshi

- దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
- వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి డిమాండ్
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘సీఎం చంద్రబాబు గత నాలుగు నెలల్లో రూ.లక్ష కోట్ల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారు. మళ్లీ ఆయనే పెద్దనోట్లను రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మోదీ తలపెట్టిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం చంద్రబాబుకు లీకరుు్యందని ఆయన ఆరోపిస్తూ, ప్రధాని ప్రకటన చేయడానికి కొద్దిరోజుల ముందుగానే రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. దీన్ని బట్టి పెద్ద నోట్ల రద్దు గురించి కొంతమంది నల్లకుబేరులకు, తమకు కావాల్సిన వారికి ముందే సమాచారమిచ్చారన్న అనుమానాలు బలపడుతున్నాయని, వాళ్లందరూ సర్దుకున్న తరువాత సామాన్య ప్రజల గుండెల్లో గునపంలా రద్దు నిర్ణయాన్ని ప్రకటించారని ఆయన విమర్శించారు.

మోదీ తలపెట్టిన పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చంద్రబాబుకు ఏ విధంగా లీకరుు్యందనే అనే అంశంపై సీబీఐతోగానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితోగానీ విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు.  జగన్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణకు తాము సిద్ధమేనని, అధికారం టీడీపీ చేతిలోనే ఉంది కనుక వారాపని చేయవచ్చని  సవాలు విసిరారు.పెద్ద నోట్ల రద్దు  సమర్థనీయమే అరుునా ఒక విధానం లేకుండా  చేసినందువల్ల  అసాధారణ  పరిస్థితులు నెలకొన్నాయన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement