వందేళ్ల వనరు! | Sakshi
Sakshi News home page

వందేళ్ల వనరు!

Published Mon, Mar 27 2017 3:18 AM

వందేళ్ల వనరు!

‘గ్రేటర్‌’ దాహార్తిని తీర్చనున్న ‘కేశవాపూర్‌’
రిజర్వాయర్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక రెడీ


- ఆరు నెలల్లోగా భూసేకరణ దిశగా వడివడిగా అడుగులు
- అటవీ భూమి సేకరణపైనే దృష్టి
- పాములపర్తిసాగర్‌ నుంచి 20 టీఎంసీల గోదావరి జలాలను ఈ రిజర్వాయర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు


సాక్షి, హైదరాబాద్‌: త్వరలో గ్రేటర్‌ హైదరాబాద్‌ దాహార్తి తీరనుంది. ఎండాకాలం కూడా తాగు నీరు సమృద్ధిగా లభించనుంది. మరో వందేళ్లవరకు మహానగరానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు శామీర్‌పేట్‌ మండలం కేశవాపూర్‌లో ప్రభుత్వం నిర్మించతలపెట్టిన భారీ స్టోరేజి రిజర్వాయర్‌ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమైంది. జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ.7,770 కోట్ల అంచనా వ్యయంతో 20 టీఎంసీల గోదావరి జలాల నిల్వసామర్థ్యంతో దీన్ని నిర్మించనున్నారు.

ఈ రిజర్వాయర్‌కు అవసరమైన అటవీ, ప్రైవేటు భూములను ఆరునెలల్లోగా సేకరించే అంశంపై రెవెన్యూ, జలమండలి యంత్రాంగం దృష్టిసారించింది. ఈ రిజర్వాయర్‌కు ప్రధానంగా కొండపోచమ్మ సాగర్‌ నుంచి గోదా వరి జలాలను తరలించి నింపేందుకు వీలుగా ఏర్పా ట్లు చేయనున్నారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి సం బంధించి సాంకేతిక అంశాలు, డిజైన్లు, డ్రాయింగ్స్, పైప్‌లైన్స్, నీటిశుద్ధికేంద్రాలు, శుద్ధిచేసిన నీటిని ఘన్‌పూర్‌ రిజర్వాయర్‌కు తరలించే పైప్‌లైన్ల ఏర్పాటు.. తదితర అంశాలను వ్యాప్కోస్‌ సంస్థ సమగ్ర ప్రాజెక్టు నివేదికలో పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు జలమండలి సన్నద్ధమౌతోంది.

భూసేకరణ దిశగా వడివడిగా అడుగులు...
ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన 3,822 ఎకరాల భూమిలో 918.84 ఎకరాల మేర అటవీ భూమి ఉంది. మిగతాది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది. ప్రభుత్వం అనుమతిస్తే ఈ భూమిని ఆరు నెలల్లో సేకరించేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమౌతోంది. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు సుమారు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

రాబోయే వందేళ్లకు గ్రేటర్‌కు జల భాగ్యం...
విశ్వనగరం బాటలో పయనిస్తున్న మహానగర జనా భా కోటికి చేరువైంది. పదేళ్లలో జనాభా అనూహ్యంగా పెరిగే అవకాశముంది. కోట్లాది జనాభా తాగునీటి అవసరాలకు మరో వందేళ్లపాటు ఢోకాలేకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ భారీ స్టోరేజి రిజర్వాయర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చుట్టూ సహజసిద్ధమైన కొండలు, మధ్యలో జలసిరులు కొలువై ఉండేలా అందమైన రాతి ఆనకట్టతో ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికి డిజైన్లు సిద్ధమయ్యాయి. దీంతోపాటు చౌటుప్పల్‌ మండలం(యాదాద్రి జిల్లా) లోని దండుమల్కాపూర్‌లోనూ మరో 20 టీఎంసీల కృష్ణా జలాల నిల్వకు మరో భారీ స్టోరేజి రిజర్వాయర్‌ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే.

అయితే కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలని ప్రభుత్వం యోచి స్తోంది. అయితే ప్రభుత్వం బడ్జెటరీ నిధులు కేటాయిం చడం లేదా హడ్కో, జైకా, ప్రపంచ బ్యాంకు, ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణ సేకరణ లేదా, కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో ఈ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

రావాటర్‌ తరలింపునకు ఏర్పాటు చేసే ప్రధాన పైప్‌లైన్‌ పొడవు: 18.2 కి.మీ
నీటిశుద్ధి కేంద్రం: 172 మిలియన్‌ గ్యాలన్ల నీటిని శుద్ధిచేసేందుకు వీలుగా నిర్మాణం
రావాటర్‌ తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు,వాటి సామర్థ్యం: 16 మెగావాట్ల సామర్థ్యంగల 4 పంప్‌లు
శుద్ధిచేసిన నీటి తరలింపునకు ఏర్పాటు చేసే పంపులు, వాటి సామర్థ్యం: 2 మెగా వాట్ల సామర్థ్యంగల 8 పంప్‌లు
శుద్ధిచేసిన నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసే పైప్‌లైన్‌లు: 8 కి.మీ మార్గంలో
3,000 డయా వ్యాసార్థం గలవి
సీడబ్ల్యూఆర్‌(క్రాప్‌ వాటర్‌ రిక్వైర్‌మెంట్‌):80 మిలియన్‌ లీటర్లు

Advertisement

తప్పక చదవండి

Advertisement