బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు | Sakshi
Sakshi News home page

బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు

Published Thu, Mar 10 2016 1:35 PM

key proposals in ap assembly budget

హైదరాబాద్: 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. రహదారుల విస్తరణ, విమానాశ్రయాల ఏర్పాటు, ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు గురించి బడ్జెట్లో ప్రస్తావించారు.
 

  • ఈ ఏడాదిలో జైకా సాయంతో చెన్నై-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభం
  • అలాగే ఏడీబీ సాయంతో విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రారంభం
  • ప్రకాశం జిల్లాలో 4,231 ఎకరాలలో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ ఏర్పాటు
  • చిత్తూరు జిల్లాలో 5 వేల హెక్టార్ల విస్తీర్ణంలో నేషనల్ ఇన్వెస్టిమెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు సూత్రపాయ అంగీకారం
  • వ్యవసాయ రంగానికి 7 గంటల విద్యుత్ సరఫరా
  • కాకినాడ-కృష్ణపట్నం-విశాఖపట్టణంలో 3 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు
  • వేగంగా విజయవాడ, రాజమహేంద్రవరం విమానాశ్రయాల విస్తరణ
  • భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు, నాగార్జునసాగర్, దొనకొండల్లో 5 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు
  • రాయలసీమ ప్రాంతాన్ని జాతీయరహదారుల ద్వారా రాష్ట్ర రాజధానితో అనుసంధానం

Advertisement
Advertisement