బలవంతపు భూసేకరణ బిల్లొద్దు: కోదండరాం | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణ బిల్లొద్దు: కోదండరాం

Published Wed, Dec 28 2016 2:13 AM

బలవంతపు భూసేకరణ బిల్లొద్దు: కోదండరాం

29న ధర్నా.. వాల్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లు–2016 ఆపాల ని, బలవంతపు భూసేకరణ జరపొద్దని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. భూనిర్వాసితుల హక్కు లను హరించేలా వ్యవహరిస్తున్న సర్కార్‌కు నిరసనగా ఈ నెల 29న నిర్వహించనున్న ధర్నా పోస్టరును జేఏసీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు.

ఈ సందర్భం గా జేఏసీ అగ్రనేతలు ప్రహ్లాద్, ఇటికాల పురుషోత్తం, బైరి రమే శ్‌తో కలసి ఆయన మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టం–2013 అమలు లో  ఉండగా రాష్ట్ర ప్రభుత్వ చట్టం మరోమారు భూసేకరణ చట్టంను తీసుకురావడం సరికాదన్నారు. జేఏసీ కో చైర్మన్‌ ప్రహ్లాద్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూమిని ఈచట్టం పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీని వల్ల భూనిర్వాసితులు పెద్ద ఎత్తున నష్టపోతారని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, కేంద్ర చట్టం ప్రకారమే పునరావాసం, నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

దళితులను అవమానిస్తున్న ఎంపీ
అప్రజాస్వామికంగా, అసభ్య పదజాలంతో దళిత జాతిని అవమానించేలా టీఆర్‌ఎస్‌ ఎంపీ సుమన్‌ మాట్లాడుతున్నారని జేఏసీ కో చైర్మన్‌ ఇటికాల పురుషోత్తం, కో కన్వీనర్‌ భైరి రమేశ్‌ విమర్శించారు.

Advertisement
Advertisement