'వరద సమస్యలను పరిష్కరిస్తాం' | Sakshi
Sakshi News home page

'వరద సమస్యలను పరిష్కరిస్తాం'

Published Thu, Sep 22 2016 4:44 PM

'వరద సమస్యలను పరిష్కరిస్తాం' - Sakshi

హైదరాబాద్: నగరంలోని వరద సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని మున్సిపల్, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. గురువారం ఆయన హైదరాబాద్ నగరంలో నిన్నటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అక్కడి పరిసార ప్రాంతాల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు కూడా తమ సమస్యలను కేటీఆర్కు చెప్పుకుని వాపోయారు. వారి సమస్యలను తెలుసుకున్న కేటీఆర్.. భవిష్యత్తులో నిన్నటి తరహా ఘటనలు పునరావృతం కానివ్వమని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement