ఒంటరి పోరాటం... అధికారమే లక్ష్యం | Sakshi
Sakshi News home page

ఒంటరి పోరాటం... అధికారమే లక్ష్యం

Published Wed, May 17 2017 2:54 AM

ఒంటరి పోరాటం... అధికారమే లక్ష్యం - Sakshi

- 2019 ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌
- టీఆర్‌ఎస్‌ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళతాం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగి 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ప్రధాన ఎజెండాగా తమ పార్టీ ముందుకు సాగుతోం దని బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. మూడేళ్ల పాలనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు, ప్రధాని మోదీ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా టీఆర్‌ఎస్‌ పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలతో రైతాంగం, విద్యార్థులు, నిరుద్యోగ యువత... ఇలా వివిధ వర్గాల ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు.

ఇతర రాజకీయ పార్టీలపై నమ్మకం సన్నగిల్లడంతో పాటు టీఆర్‌ఎస్‌పై బీజేపీ ఒక్కటే రాజీలేని పోరాటం చేస్తుందనే భావన బలపడుతోందన్నా రు. బాహుబలిని తలదన్నే, అణ్వాస్త్రాన్ని మించిన బ్రహ్మాస్త్రం మోదీ రూపంలో వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటన పార్టీకి సత్ఫలితాలనిస్తుందన్నారు. ఈ నెల 22, 23, 24 తేదీల్లో అమిత్‌షా రాష్ట్ర పర్యటన నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్టుల సంఘం (టీజేయూ) మంగళవారం లక్ష్మణ్‌తో మీట్‌ ది ప్రెస్‌ నిర్వహించింది.

ఏ పార్టీతో పొత్తు ఉండదు...
వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పాటు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్లడం, ఇతర అంశాలపై పోరాడతామన్నారు. అమిత్‌షా పర్యటనకు ఇతరపార్టీల నాయకులు బీజేపీలో చేరికకు సంబంధం లేదన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరతారంటూ జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ... పార్టీలో చేరే విషయంపై చాలామంది చర్చలు జరుపుతున్నారని, ఎవరన్నా చేరితే మీడియాకు తెలియజేస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయాలా.. లేక ఎమ్మెల్యేగానా అన్నది పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఒకవేళ పార్టీ పోటీ చేయవద్దన్నా సామాన్య కార్యకర్తగా పని చేస్తానన్నారు. పార్టీలో సీఎం ఎవరనే రేసు ఉందా అన్న మరో విలేకరి ప్రశ్నకు బీజేపీలో ఎలాంటి రేస్‌లుండవని, పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందని జవాబిచ్చారు.

సీఎం స్పందించరా?
ప్రతిపక్షాలను ఉద్దేశించి హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి... రెచ్చిపోతే చచ్చిపోతారన్న వ్యాఖ్యను సీఎం కేసీఆర్‌ ఖండించకపోవడం దేనికి సంకేతమని లక్ష్మణ్‌ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు హద్దులు మీరి రెచ్చిపోతే చట్టప రంగా చర్యలు తీసుకోవాలే తప్ప.. మం త్రులు హింసను ప్రేరేపించేలా మాట్లాడడం తగదన్నారు. సోమవారం ధర్నాచౌక్‌ వద్ద ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమ న్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసం ఘాలపై ఇంత పెద్ద ఎత్తున నిర్భందాన్ని ప్రయోగించడం అవసరమా అని ప్రశ్నించారు.

Advertisement
Advertisement