అన్నీ క్లియర్‌... అయినా పరేషాన్‌ | Sakshi
Sakshi News home page

అన్నీ క్లియర్‌... అయినా పరేషాన్‌

Published Tue, May 15 2018 1:28 AM

Latest Controversy in HMDA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ ప్లాట్లు క్రమబద్ధీకరించడంలో భాగంగా హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నుంచి మీకు లే అవుట్‌ రెగ్యులేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) క్లియరెన్స్‌ అయిందా... ఇక ఎంచక్కా భవన అనుమతులకు వెళితే సాఫీగా అనుమతి వస్తుందని అనుకుంటున్నారా... అలాంటి ఆశలుంటే వదులుకోవాల్సిందే... ఎందుకంటే హెచ్‌ఎండీఏ అధికారులే స్వయంగా ఫైనల్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేసిన ఎల్‌ఆర్‌ఎస్‌ ధ్రువీకరణ పత్రం తీసుకొని మళ్లీ భవన నిర్మాణ అనుమతులకు వెళ్లిన దరఖాస్తుదారులకు ప్లానింగ్‌ విభాగ సిబ్బంది చుక్కలు చూపెడుతున్నారు.

కళ్ల ముందు ఎల్‌ఆర్‌ఎస్‌ ధ్రువీకరణ పత్రం కనబడుతున్నా, అది క్లియర్‌ చేసే క్రమంలో అడిగిన నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ)లను మళ్లీ సమర్పించాలం టూ షార్ట్‌ఫాల్స్‌ పంపుతూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇరిగేషన్, రెవె న్యూ విభాగాల నుంచి ఎన్‌వోసీలు తేవాలని వేధిస్తున్నారు. కొందరు అధికారులు ఆమ్యామ్యాలకు ఆశపడి ఇలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి.


ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ ఇలా...
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ టైటిల్‌ స్క్రూటినీ, టెక్నికల్‌ స్క్రూటినీ పూరై్తన తర్వాత సక్రమమని తేలితే క్లియరెన్స్‌ ఇస్తారు. ఈ క్రమంలో టైటిల్‌ పరిశీలనలో ఏమైనా ప్రభుత్వ భూములు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్, వక్ఫ్‌ భూములు తదితరాలు ఏమైనా ఉంటే సంబంధిత విభాగాల నుంచి ఎన్‌వోసీలు తేవాలంటూ హెచ్‌ఎండీఏ తహసీల్దార్‌లు షార్ట్‌ఫాల్స్‌ పంపిస్తారు. వీటిని ఆయా విభాగాల నుంచి తీసుకొచ్చి సమర్పిస్తే టైటిల్‌ క్లియర్‌ అవుతుంది.

ఇక టెక్నికల్‌ స్క్రూటినీకి వస్తే... ఓపెన్‌ స్పేస్, రీక్రియేషనల్, వాటర్‌ బాడీ, మాన్యుఫాక్చరింగ్, సెంట్రల్‌ స్క్వేర్, ట్రాన్స్‌పొర్టేషన్, బయో కన్స ర్వేషన్, ఫారెస్ట్‌ జోన్, మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు, ఓపెన్‌ స్పేస్‌ ఆఫ్‌ లే అవుట్, నది, వాగు, నాలా బఫర్‌జోన్‌లోని ప్లాట్లు, శిఖంలోని ప్లాట్లు, వాటర్‌బాడీలోని ప్లాట్లు తదితరాల కింద వస్తున్నా యా అని పరిశీలించి సక్రమంగా ఉంటే క్లియర్‌ చేస్తారు.

నాలా సమీపంలో ప్లాట్‌ ఉందని భావి స్తే ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్, జాయింట్‌ కలెక్టర్‌ స్థాయికి తగ్గని అధికారి నుంచి ఎన్‌వోసీ తీసుకురావాలంటూ షార్ట్‌ఫాల్స్‌ పంపిస్తారు. దాదాపు నెలపాటు దరఖాస్తుదారులు కష్టపడి ఎన్‌వోసీలు తీసుకొచ్చి సమర్పిస్తే క్లియర్‌ చేస్తారు. ఇలా హెచ్‌ఎండీఏకు వచ్చిన లక్షా75వేలకు పైగా దర ఖాస్తుల్లో లక్ష క్లియర్‌ చేయగా, 75వేలకుపైగా దరఖాస్తులను తిరస్కరించారు.  

డీపీఎంఎస్‌లోనూ అదే తంతు...
హెచ్‌ఎండీఏ నుంచి ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ వచ్చింది కదా... ఇక అనుమతులు తొందరగానే వస్తాయని ఆశపడ్డ భవన నిర్మాణ దరఖాస్తుదారులకు ప్లానింగ్‌ విభాగ అధికారులు చుక్కలు చూపెడుతున్నారు. ఇన్‌స్పెక్షన్‌ రిపోర్ట్‌ నుంచి టెక్నికల్‌ స్క్రూటినీ వరకు కొంత మంది ప్లానిం గ్‌ సిబ్బందికి ఆమ్యామ్యాలు అందితే తప్ప ఫైల్‌ ముందుకు కదలట్లేదు.

ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరైన దరఖాస్తులకు కూడా ఆర్‌డీవో నుంచి అగ్రికల్చ ర్‌ నుంచి నాన్‌ అగ్రికల్చర్‌ కన్వర్షన్‌ ప్రొసీడింగ్స్‌ తేవాలంటూ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరింగ్‌ ర్యాంక్, జాయింట్‌ కలెక్టర్‌ స్థాయికి తగ్గకుండా అధికారి ద్వారా ఎన్‌వోసీలు సమర్పించాలని షార్ట్‌ఫాల్స్‌ పంపుతూ దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

టైటిల్, టెక్నికల్‌ స్క్రూటినీ చేసి క్లియరెన్స్‌ ఇచ్చిన అధికారులు మళ్లీ అదే ప్లాట్‌కు అవే ఎన్‌ఓసీలు తేవాలంటూ వేధించడం ప్లానింగ్‌ సిబ్బంది పనితీరు ఏంటో తెలియజేస్తోంది. వచ్చి కలిస్తే సరి.. లేదంటే ఎల్‌ ఆర్‌ఎస్‌ ఉన్నా షార్ట్‌ఫాల్స్‌ బెడద తప్పదన్నట్లు వ్యవహరిస్తున్నారని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొందరు చేస్తున్న ఇలాంటి పనుల వల్ల హెచ్‌ఎండీఏపై తప్పుడు ముద్ర పడుతోం ది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement