Sakshi News home page

రాష్ట్రంలో చీకటి పాలన: మల్లు రవి

Published Sat, May 28 2016 3:18 AM

రాష్ట్రంలో చీకటి పాలన: మల్లు రవి - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నియంతృత్వ, చీకటి పాలన నడుస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. శుక్రవారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. రెండేళ్ల టీఆర్‌ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మీడియాను ఇబ్బందులు పెట్టారన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కారన్నారు.

నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎన్‌కౌంటర్లు చేయించారన్నారు. యూనివర్సిటీలో ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టడం ద్వారా తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నారన్నారు. ప్రతిపక్షపార్టీలకు చెందిన ఎంపీలను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇతర ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారన్నారు.  విమర్శించారు. దళితుడినే తెలంగాణకు తొలి సీఎంను చేస్తానని చెప్పిన కేసీఆరే పదవీ వ్యామోహంలో పడిపోయారని మల్లు రవి విమర్శించారు. జిల్లాల ఏర్పాటుతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా పునర్విభజన చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement