ప్రసవం కోసం భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో...రెండో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు..! | Sakshi
Sakshi News home page

ప్రసవం కోసం భార్య పుట్టింటికి వెళ్లిన సమయంలో...రెండో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు..!

Published Sun, Aug 16 2015 4:42 AM

Man cheated his wife and married another women

బంజారాహిల్స్ :  భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో భర్త మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ అతడి భార్య బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 11లో నివసించే ఎం. నరేష్(26) చర్చి పాస్టర్.  2010లో బోరబండ స్వరాజ్‌నగర్‌కు చెందిన హెలెన్ గ్లోరీని వివాహం చేసుకున్నాడు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. ఇటీవలే గ్లోరీ ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. ఈ సమయంలో నరేష్ రాంనగర్‌లో ఉండే ఆలివ్ అలియాస్ డింపుల్‌పట్ల మోజు పెంచుకున్నాడు. ఇద్దరూ మూడు రోజుల క్రితం పెళ్లి  చేసుకున్నాడు.

తన కూతురిని వంచించి పెళ్లి చేసుకున్నాడంటూ ఆలివ్ తండ్రి, కుటుంబ సభ్యులు శనివారం బంజారాహిల్స్‌లోని నరేష్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. నరేష్‌పైకి కుక్కలను వదలడంతో త్రుటిలో తప్పించుకున్నాడు. తీవ్ర ఉద్రిక్తత నడుమ నరేష్, డింపుల్ ప్రాణరక్షణ కోసం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తనకు విడాకులు ఇవ్వకుండానే రెండో పెళ్లి చేసుకున్నాడంటూ గ్లోరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టేషన్‌లో కూడా రెండు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Advertisement
Advertisement