Sakshi News home page

'ఫేస్ బుక్కయ్యాడు'

Published Fri, Mar 13 2015 9:32 PM

Man held for sending abusive messages to woman on Facebook

హైదరాబాద్: ఫేస్బుక్లో ఓ అమ్మాయికి అసభ్యకరమైన సందేశాలు పంపించి ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. గీత కార్మికుడిగా పనిచేస్తున్న మల్యాల రాజశేఖర్ గౌడ్ అనే వ్యక్తి గత నెలలో ఓ 22 ఏళ్ల అమ్మాయిని ఫేస్బుక్ ద్వారా వేధించాడు. తొలుత ప్రెండ్ రిక్వెస్ట్ పంపించగా ఆమె అంగీకరించింది. అప్పటి నుంచి ఆమె స్పందించకపోయినా వివిధ రూపాల్లో సందేశాలు పంపించడం ప్రారంభించాడు. ఇబ్బందికలిగేలా అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను గత నెలలో సంప్రదించగా పోలీసులు అతడిని శుక్రవారం అరెస్టు చేశారు. ఓ ట్యాబ్ ద్వారా అతడు నిత్యం ఆ అమ్మాయికి సందేశాలు పంపించినట్లు రాజశేఖర్ గౌడ్ అంగీకరించాడు.

Advertisement
Advertisement