'తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది' | Sakshi
Sakshi News home page

'తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది'

Published Tue, Nov 1 2016 1:36 PM

'తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది' - Sakshi

హైదరాబాద్: ఎన్నో రంగాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. రెండేళ్లలో ఎన్నోమైలురాళ్లు అధిగమించామని, దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సులభతర వాణిజ్యంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలవడం సంతోషమని అన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నవ తెలంగాణ పురోగామిస్తోందన్నారు.

తొమ్మిది నెలల్లో స్వల్ప వ్యవధిలోనే గణనీయ ప్రగతి సాధించామని చెప్పారు. 26 చట్టాలను సవరించి కొత్త విధానాలు తీసుకొచ్చామన్నారు. 113 ఆన్ లైన్ సర్వీసులు ప్రారంభించామని, కార్మిక శాఖలోనే 22 సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. 22 మంత్రిత్వ శాఖలు, వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేశాయడం వల్లే ఇదంతా సాధ్యమైందని స్పష్టం చేశారు.

సమూలమైన మార్పు, సమగ్రమైన ఆలోచనావిధానంతో సంస్కరణలు చేపట్టామని వెల్లడించారు. అవినీతి ఆస్కారంలేని విధానాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. పరిశ్రమల తనిఖీల్లోనూ కీలక మార్పులు చేశామన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో ముందు ఉందన్నారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.

Advertisement
Advertisement