'ఎమ్మెల్సీలు... ఇది సరైన పద్దతి కాదు' | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్సీలు... ఇది సరైన పద్దతి కాదు'

Published Wed, Jun 25 2014 1:54 PM

'ఎమ్మెల్సీలు... ఇది సరైన పద్దతి కాదు' - Sakshi

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల నాగర్ కర్నూలు ఎంపీ నంది ఎల్లయ్య ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఒకే పార్టీలో కొనసాగలని ఆయన టి.కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు హితవు పలికారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లో నంది ఎల్లయ్య మాట్లాడుతూ... ఇది సరైన పద్దతి కాదంటూ పార్టీ ఎమ్మెల్సీలకు సూచించారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకోవడాన్ని నంది ఎల్లయ్య తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును అనుసరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్సీలతోపాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్సీలు ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరునున్నారు. ఈ నేపథ్యంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు నంది ఎల్లయ్య పై విధంగా స్పందించారు.

తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు ఆమోస్, జగదీశ్వర్‌రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, భూపాల్‌రెడ్డితోపాటు మరికొందరు, వీరితోపాటు బీఎస్పీకి చెందిన ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు టీఆర్ఎస్ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అలాగే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు, పీఆర్‌టీయూకు చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా అదే దారిలో ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement