సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం | Sakshi
Sakshi News home page

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

Published Sun, Jul 2 2017 2:14 AM

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

జీఎస్టీపై సీపీఐ నేత నారాయణ
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరు ద్ధంగా ఉందని..జీఎస్టీ ప్రజలపై పెనుభారంగా మారుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ పేర్కొన్నారు. మఖ్దూం భవన్‌లో శనివారం జరిగిన సీపీఐ రాష్ట్రకార్యవర్గ సమావేశంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలు, భవిష్యత్‌ కార్యక్రమాలపై చర్చించా రు.

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... గుజరాత్‌ ప్రయోగాలను దేశమంతటా వ్యాపింప చేయాలని మోడీ సర్కార్‌ యోచిస్తోందని మండి పడ్డారు. జీఎస్టీ చట్టం కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ము కాసే విధంగా ఉందన్నారు. వ్యవసాయ రంగం, చిన్న తరహా పరిశ్రమలు, నిరుద్యోగులు పాలిట జీఎస్టీ పెను ప్రమాదంగా మారనుందన్నారు. కేంద్రం కనుసన్నల్లోనే తమిళనాడులో పాలన సాగుతోందని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి, పల్లా వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement