గ్రహాంతర జీవులను గుర్తించారా? | Sakshi
Sakshi News home page

గ్రహాంతర జీవులను గుర్తించారా?

Published Tue, Jun 27 2017 1:01 AM

గ్రహాంతర జీవులను గుర్తించారా?

నాసా గుర్తించినట్లు యూట్యూబ్‌లో ఓ వీడియో చక్కర్లు
 
సాక్షి, హైదరాబాద్‌: గ్రహాంతర వాసులు ఉన్నారని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గుర్తించిందా? నాసా సంగతేమోగానీ.. రెండు మూడు రోజులుగా ఈ వార్త నెట్‌ ప్రపంచంలో వేగంగా చక్కర్లు కొడుతోంది. నాసా ఉన్నతాధికారి ఒకరు ఈ విషయమై అమెరికన్‌ పార్లమెంటుకు వాంగ్మూలమిచ్చినట్లు యూట్యూబ్‌లో గుర్తుతెలియని వ్యక్తి పేరుతో ఉన్న వీడియో వైరల్‌ అవుతోంది. ఆ ఉన్నతాధికారి పేరు థామస్‌ జుర్‌బుకెన్‌ అని.. రెండు నెలల క్రితం అమెరికన్‌ పార్లమెంటుకు ఓ వాంగ్మూలమిచ్చారని వీడియోలో పేర్కొన్నారు.

మానవజాతి గ్రహాంతర వాసుల ఉనికిని నిర్ధారించే విషయమై ఇప్పటివరకూ చేప ట్టిన అన్ని కార్యక్రమాలు, ప్రయోగాలను దృష్టిలో ఉంచు కుని తాను ఈ అంచనాకు వస్తున్నట్లు థామస్‌ ఈ వీడియోలో చెబుతారు. శని గ్రహపు ఉపగ్రహా ల్లో ఒక దానిపై ఆక్సిజ న్‌ ఉన్నట్లు నాసా ఇటీవలే గుర్తించడం.. గురు గ్రహం ఉపగ్రహమైన యూరోపా పై సముద్రాలు ఉన్నాయన్న అంచనాలు కూడా బలపడటం.. కెప్లర్‌ టెలిస్కోపు సేకరించిన సమాచారం ఆధారంగా జరిపిన విశ్లేషణ కారణంగా 219 కొత్త ఎక్సోప్లానెట్లను గుర్తించడం తదితర పరిణామాలను ఈ వీడియోలో ఉటంకించారు. ఈ నేపథ్యంలో ఇతర గ్రహాలపై జీవం ఉండేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే నాసా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన లేదు. ఈ వీడియో ఉన్న యూట్యూబ్‌ అకౌంట్‌ ఓ హ్యాకర్‌ గ్రూప్‌నకు చెందినది కావడం కొసమెరుపు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement