ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు | Sakshi
Sakshi News home page

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు

Published Wed, May 18 2016 11:52 PM

ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పలేదు

వివేక్‌నగర్:  తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఏనాడు చెప్పలేదని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను తెలంగాణ నిరుద్యోగ యువతతో భర్తీ చేస్తామని చెప్పామని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. తెలంగాణ సాధనలో ప్రజలందరి భాగస్వామ్యం ఉందన్నారు. తెలంగాణ ఎన్‌జీఓ యూనియన్ హైదరాబాద్ జిల్లా, హైదరాబాద్ గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం వట్టికోట ఆల్వార్ స్వామి స్మారక నగర గ్రంథాలయ సంస్థలో జరిగిన స్వామిగౌడ్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎన్‌జిఓ నాయకుడిగా తనకు ఉన్న గుర్తింపై ఉన్నత పదవికి కారణమైందన్నారు.


గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చే స్తానన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని సూచించారు. టీఎన్‌జిఓ సెంట్రల్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దేవిప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగులందరికీ ప్రతి నెల 1నే జీతాలు అందేలా చూస్తామన్నారు. తెలంగాణలో గ్రంథాలయ ఉద్యమానికి కృషి చేసిన వట్టికోట అల్వార్ స్వామి పేరును నగర గ్రంధాలయానికి పెట్టడం అభినందనీయమన్నారు. అనంతరం స్వామిగౌడ్‌ను గ్రంథాలయ ఉద్యోగులు సత్కరించారు. కార్యక్రమంలో  వెంకటేశ్వరశర్మ, రవీందర్‌రెడ్డి, ఎంఏ హమీద్, ఎస్‌ఎం హూస్సేన్, బి.రేచల్, జి . ప్రభాకర్, ఏవీఎన్ రాజు,  బొల్లం మహేందర్, చాగంటి అయోద్య  పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement