‘ఆసరా’ అందక ఆగిన గుండెలు | Sakshi
Sakshi News home page

‘ఆసరా’ అందక ఆగిన గుండెలు

Published Wed, Nov 19 2014 1:41 AM

‘ఆసరా’ అందక ఆగిన గుండెలు - Sakshi

రాయికల్/కథలాపూర్/ పరిగి/ వాంకిడి: ఆసరా పథకంలో తమ పేరు లేదని కరీంనగర్ జిల్లాలో ఇద్దరు, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున  గుండెపోటుతో మరణించారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా రాయికల్ మం డలం కిష్టంపేటకు చెందిన తంగెళ్ల మల్లవ్వ(85)కు గతంలో పింఛన్ వచ్చేది. ఇటీవల జీపీలో కొత్త అర్హుల జాబితా పెట్టగా, మంగళవారం వెళ్లి చూసింది. అందులో పేరు లేదని తెలిసి గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన గండికోట రామక్క(66) సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జీపీ వద్ద నిరీక్షిం చింది.

కొత్త జాబితాలో తన పేరు లేదని తెలవడం తో కన్నీరుపెట్టుకుంటూ ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత మరణించింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం మిట్టకోడూరుకు చెందిన బోయిన రామయ్య(68)కు ముగ్గురు కొడుకు లు, ముగ్గురు కుమార్తెలు. అందరి పెళ్లిళ్లు చేసి... తనకున్న భూమిని పంచి ఇచ్చాడు. చిన్నగదిలో వేరుగా ఉంటున్నాడు. ఆరేళ్లుగా రామయ్యకు పింఛన్ వస్తోంది. కొడుకులకిచ్చిన భూమి ఇంకా రామయ్య పేరు మీదనే ఉందని అధికారులు పింఛన్ నిలిపివేసినట్లు తెలిసింది. మనోవేదన తో మంచం పట్టి సోమవారం రాత్రి చనిపోయా డు. ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం కమానకి చెందిన గోగుల వసంత్ (78)కు గతంలో పింఛన్ వచ్చేది. కొత్త జాబితాలో తన పేరు లేదని బెంగ పడేవాడు. ఈ నెల 17న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలోనూ పాల్గొన్నాడు. సోమవారం రాత్రి ఇక పింఛన్ రాదని అంటూనే గుండెపోటుతో కుప్పకూలాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement