చంద్రబాబుకు ముందే తెలుసా? | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ముందే తెలుసా?

Published Thu, Nov 10 2016 2:36 AM

చంద్రబాబుకు ముందే తెలుసా?

అందుకే జాగ్రత్త పడ్డారంటున్న ప్రతిపక్షాలు

 సాక్షి, హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందే తెలుసా? అందుకే ఆ క్రెడిట్ కొట్టేయడం కోసం ముందుగానే రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటూ ప్రధానమంత్రికి లేఖ రాశారా? అవుననే అంటున్నారుు ప్రతిపక్షాలు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అరుున టీడీపీ అధినేతకు పక్కా సమాచారం ఉందని అం దుకే ఆయన ముందుగా జాగ్రత్త పడ్డారని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు.

చంద్రబాబు పెద్ద నోట్లు రద్దు చేయాలంటూ గత నెల 12న ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఆ తర్వాత జరిగిన మరో పరిణామం కూడా ఈ అనుమానాలకు ఊతమిచ్చేలా ఉంది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను ఫ్యూచర్ గ్రూప్‌కి విక్రరుుంచడం ప్రతిఫలంగా నగదును కాదని ఆ సంస్థ వాటాను తీసుకోవడం కూడా ఈ అనుమానాలను బలపరిచేదిగా ఉందని విశ్లేషకులంటున్నారు. సరిగ్గా ప్రధాని మోది ప్రకటన ముందు రోజు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదరడం విశేషం. చంద్రబాబు ముందుగా తెలియడం వల్లనే నగదును తీసుకోలేదని, ఇలా పెద్దనోట్ల రద్దు జరిగేనాటికి పెద్దవాళ్లంతా సర్దుకున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారుు.

ఆయనకు ముందెలా తెలిసింది?: బొత్స
పెద్ద నోట్లను రద్దు చేస్తారనే విషయం చంద్రబాబుకు ముందుగానే ఎలా తెలిసింది అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడు తూ ముఖ్యమంత్రిపైనా, టీడీపీ మంత్రుల పైనా కేంద్రం గట్టి నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజా ధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అం దరికీ తెలుసునని, అందుకే ఈ విషయాన్ని ముందుగా తెలుసుకుని ఆయన జాగ్రత్త పడి ఉంటాడని బొత్స అన్నారు.

పెద్ద నోట్లను రద్దు చేయాలని తానే కేంద్రానికి లేఖ రాశానని చంద్రబాబు చెప్పుకోవడాన్ని విలేకరులు ప్రస్తావించగా నిజమే... తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి రూ 500 నోట్ల కట్టలతో టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని పంపేదీ చంద్రబాబే,  మళ్లీ ఇలాంటి నోట్లను రద్దు చేయమని లేఖ రాసేది కూడా ఆయనే కదా... అని బొత్స వ్యంగ్యంగా అన్నారు. అసలు చంద్రబాబు వంటి నేతలు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమని, ఓవైపు సమాచారం తెలుసుకుని జాగ్రత్త పడతారు, మరో వైపు కేంద్రానికి లేఖలు కూడా రాస్తారన్నారు. ఆ తరువాత తనంతటి ఉత్తములు లేనే లేరని తనకు తానే కితాబులు కూడా చంద్రబాబు ఇచ్చుకుం టారని బొత్స వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement