పర్సంటైల్ నార్మలైజేషన్ విధానమిదీ.. | Sakshi
Sakshi News home page

పర్సంటైల్ నార్మలైజేషన్ విధానమిదీ..

Published Thu, Apr 28 2016 4:38 AM

Percentile Normalization concept is like this

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఇంటర్ బోర్డుల పరిధిలో చదివిన వి ద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు, ప్రతిభావంతులకే సీట్లు కేటాయించేందుకు ర్యాంకు ఖరారులో పర్సంటైల్ నార్మలైజేషన్ విధానాన్ని సీబీ ఎస్‌ఈ అమలు చేస్తోంది. దీనిద్వారా వచ్చిన తుది ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల వంటి విద్యా సంస్థల్లో ప్రవేశాలు చేపడుతోంది. పర్సంటైల్ లెక్కించే విధానం, నార్మలైజేషన్ విధానాన్ని సీబీఎస్‌ఈ ప్రకటించింది.
 
 నార్మలైజ్డ్ బోర్డు స్కోర్ లెకి ్కంపు ఇలా.. (ఓ విద్యార్థిని ఉదాహరణగా తీసుకుంటే..)
  జేఈఈ మెయిన్‌లో మొత్తం 360 మార్కులకుగాను గరిష్టంగా వచ్చిన మార్కులు 355 అనుకుందాం (దీనిని బీ1గా పరిగణించాలి). అలాగే జేఈఈ మెయిన్ పరీక్షకు రాష్ట్ర బోర్డు నుంచి హాజరైన విద్యార్థుల్లో ఓ విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో అత్యధికంగా 350 మార్కులు సాధించాడనుకుంటే  (దీనిని బీ2గా పరిగణించాలి)... అతని నార్మలైజ్డ్ బోర్డు స్కోరును ‘బీఫైనల్= 0.5(బీ1+బీ2) ఫార్ములాతో లెక్కిస్తారు.
 అంటే బీఫైనల్ =  0.5(355+350) = 352.5 (ఇది ఆ విద్యార్థి నార్మలైజ్డ్ బోర్డు స్కోరు)
 
 జేఈఈ మెయిన్‌లో వచ్చిన మార్కులకు 60 శాతం వెయిటేజీ (ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది కనుక) ఇచ్చి... దానికి నార్మలైజ్ చేసిన ఇంటర్ బోర్డు స్కోరును కలిపి (60:40 రేషియోలో) ఆ విద్యార్థి కాంపొజిట్ స్కోర్‌ను నిర్ధారిస్తారు. అన్ని రాష్ట్రాల విద్యార్థులకు కాంపొజిట్ స్కోర్‌ను లెక్కించి.. ఎక్కువ స్కోర్ వచ్చిన వారి నుంచి మొదలుకొని (టాప్ నుంచి కిందకి) ర్యాంకులు ఖరారు చేస్తారు. ఇక్కడ విద్యార్థికి జేఈఈ మెయిన్‌లో 350 (అగ్రిగేట్) మార్కులు వచ్చాయనుకుంటే... అతడి కాంపొజిట్ స్కోర్‌ను (సి=0.6xవిద్యార్థి అగ్రిగేట్ మార్కులు +0.4xబీఫైనల్) ప్రకారం లెక్కిస్తారు.
 అంటే సీ = 0.6x350+0.4x352.5 = 351 (ఇది ఆ విద్యార్థి కాంపొజిట్ స్కోర్)
 
► పర్సంటైల్ నిర్ణయించేందుకు మార్కులను వెయ్యిగా కాకుండా ప్రతి సబ్జెక్టులో గరిష్టంగా 100 మార్కులనే పరిగణనలోకి తీసుకుంటారు. తెలంగాణ, ఏపీల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లోని ఐదు ప్రధాన సబ్జెక్టుల్లో వచ్చిన మార్కులను 50 శాతానికి తగ్గించి పర్సంటైల్ నార్మలైజేషన్ చేసి, కాంపొజిట్ స్కోర్‌ను నిర్ధారిస్తారు.

Advertisement
Advertisement