పీజీఈసెట్‌–2017 షెడ్యూల్‌ విడుదల | Sakshi
Sakshi News home page

పీజీఈసెట్‌–2017 షెడ్యూల్‌ విడుదల

Published Sun, Feb 26 2017 5:36 AM

పీజీఈసెట్‌–2017 షెడ్యూల్‌ విడుదల - Sakshi

  • మే 29 నుంచి జూన్‌ 1 వరకు పరీక్షలు
  • మార్చి రెండో వారం నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌
  • సాక్షి, హైదరాబాద్‌: పీజీఈసెట్‌–2017 పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. తేదీల వారీగా నిర్వహించే పరీక్షల టైమ్‌టేబుల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం సెట్‌ (కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌) కమిటీ సమావేశమైంది. ఉస్మానియా యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ఎస్‌.రామచంద్రం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, సంయుక్త కార్యదర్శి విజయ్‌కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, పీజీఈసెట్‌–2017 కన్వీనర్‌ సమీన్‌ ఫాతిమా, కో కన్వీనర్‌ రమేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 2017–18 విద్యాసంవత్సరంలో ఎంఈ/ఎంటెక్‌., ఎం.ఫార్మసీ, ఫార్మా–డీ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి ప్రవేశ పరీక్ష తేదీలను ఈ సమావేశంలో ఖరారు చేశారు.

    ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష...
    పీజీఈసెట్‌–2017 ప్రవేశ పరీక్షను ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు వరంగల్‌ నగరాల్లో నిర్వహించనున్నారు. మార్చి రెండో వారం నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులు రూ.800 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం రూ.400 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇతర వివరాలకు  www.pgecet.tsche.ac.in లేదా www. osmania.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పీజీఈసెట్‌–2017 కన్వీనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

Advertisement
Advertisement