బోడుప్పల్‌లో పోలీసుల కార్డెన్ సర్చ్ | Sakshi
Sakshi News home page

బోడుప్పల్‌లో పోలీసుల కార్డెన్ సర్చ్

Published Sun, Sep 4 2016 8:35 PM

police Carden search boduppal

బోడుప్పల్‌లో పోలీసులు కార్డన్ సర్చ్‌ను ఇందిరానగర్, వీరారెడ్డినగర్, కాకతీయ కళానగర్‌లో నిర్వహించి ?ప్రతి ఇంటిని జల్డెడ పట్టారు. ఆదివారం ఉదయం 4 నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్డన్ సర్చ్‌లో డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, 10 మంది ఇన్‌స్పెక్టర్లతోపాటు 200 మంది పోలీసులు పాల్గొన్నారు. తొలుత మూడు కాలనీల రోడ్లన్నీ పోలీసులు చుట్టు ముట్టారు. ఒక్కో ఇంటికి తిరుగుతూ సంబంధిత వ్యక్తుల నుంచి అన్ని రకాల వివరాలు సేకరించారు.

 

మొత్తం 400 వందల ఇళ్లల్లో ప్రతి సమాచారం సేకరించారు. ప్రతి ఇంట్లో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, గ్యాస్ సిలెండర్, ఎంత మంది కుటుంబ సభ్యులు ఉంటున్నారు. వాహనాలు ఎన్ని ఉన్నాయి. వాటికి లెసైన్‌‌సలు ఉన్నాయా.. కొత్త వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనుమానుతులు ఎవరైనా ఉంటున్నారా అనే వివరాలను సేకరించారు. ఈ కార్డన్ సర్చ్‌లో 8 మందిని అనుమానితులను, లెసైన్‌‌స లేకుండా ఉన్న 36 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను, 7 సిలెండర్లతోపాటు మరో ఇద్దరు బెల్ట్‌షాపు నిర్వాహకులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ రాంచంద్రారెడ్డి వెల్లడించారు? ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, భద్రత కోసం ఈ కార్డన్ సర్చ్‌ను నిర్వహించామన్నారు.

 

ఇళ్లు అద్దెకు ఇచ్చేటప్పుడు అన్ని వివరాలు సేకరించిన తరువాత ఇవ్వాలని కోరారు. అపరిచితులు అనుమానితులు, కొత్తవారు ఎవరైనా కాలనీలో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, పోలీసులు చేసే ప్రతి పనిలో ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు విలువైన వస్తువులు, నగదు ఉంచరాదని, ఊరికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంతోపాటు ఇరుగు పొరుగు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అల్వాల్ ఏసీపీ రఫీక్, మల్కాజిగిరి ఏసీపీ గోనె సందీప్, మేడిపల్లి ఇన్‌స్పెక్టర్ బద్దం నవీన్‌రెడ్డితోపాటు మరో 9 మంది ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, కానిస్టేబుల్‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement