కృత్రిమ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి | Sakshi
Sakshi News home page

కృత్రిమ పాల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి

Published Sun, Feb 14 2016 9:41 AM

Police raid artificial milk center in Neredmet

నేరేడ్‌మెట్ (హైదరాబాద్) : కాదేదీ కల్తీకి అనర్హం మాదిరిగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి. ఇంజక్షన్ ద్వారా పాలప్యాకెట్లలోని సగం పాలను తీసేసి.. నీళ్లతో నింపుతున్న ఓ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని నేరేడ్‌మెట్ ప్రాంతంలో గత కొంత కాలంగా కృత్రిమ పాల వ్యాపారం జోరుగా సాగుతోంది. వినియోగదారుల ఫిర్యాదు మేరకు నేరేడ్‌మెట్ పోలీసులు పాల విక్రయ కేంద్రాలపై దృష్టిపెట్టారు.

ఆదివారం ఉదయం ఒక పాల విక్రయ కేంద్రంపై దాడి చేసి పాలప్యాకెట్లలో నీళ్లు కలుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. వివిధ బ్రాండ్లకు చెందిన పాల ప్యాకెట్లలో ఇంజక్షన్ ద్వారా పాలను తీసివేసి నీళ్లు కలుపుతుండగా అతడిని పట్టుకున్నారు. అలాగే కృత్రిమ పాల తయారీకి ఉపయోగించే మిషన్, కెమికల్స్‌ను, 200 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement