టెక్నాలజీతోనే రేషన్‌ అక్రమాలకు అడ్డుకట్ట | Sakshi
Sakshi News home page

టెక్నాలజీతోనే రేషన్‌ అక్రమాలకు అడ్డుకట్ట

Published Mon, Sep 18 2017 1:13 AM

టెక్నాలజీతోనే రేషన్‌ అక్రమాలకు అడ్డుకట్ట

సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌
 
సాక్షి, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తెలంగాణ ప్రజాపంపిణీ వ్యవస్థ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోందని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ అన్నారు. వినియోగదారుల ఫోరం ఎదుర్కొంటున్న సవాళ్లపై హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సద స్సులో ఆయన పాల్గొని ప్రసంగిం చారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవ స్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను, సంస్కరణలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివ రించారు. అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూనే.. ప్రజాపంపిణీ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేశామన్నారు.

టీ–రేషన్‌ అనే యాప్‌ ద్వారా రేషన్‌ లావాదేవీలను సామా న్యులు సైతం ప్రత్యక్షంగా తెలుసు కోవచ్చన్నారు. రేషన్‌ షాపులకు సరుకులు చేరగానే లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం అం దేలా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. 171 మండల లెవల్‌ స్టాక్‌ పాయింట్లలో దశల వారీగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పౌరసర ఫరాల భవన్‌ నుంచే వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement