Sakshi News home page

కదం తొక్కిన హోంగార్డులు

Published Wed, Oct 26 2016 12:54 AM

కదం తొక్కిన హోంగార్డులు - Sakshi

- గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా
- ఆస్పత్రి భవనం పెకైక్కి దూకుతామంటూ బెదిరింపు
- సీఎం కేసీఆర్ అపారుుంట్‌మెంట్‌తో ధర్నా విరమణ
 
 హైదరాబాద్: గాంధీ ఆస్పత్రి వేదికగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ హోంగార్డులు కదం తొక్కారు. ఆస్పత్రి ప్రాంగణంలో బైఠారుుంచి ధర్నా చేపట్టారు. కొంతమంది హోంగార్డులు ఆస్పత్రి భవనం పెకైక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంగార్డులను రెగ్యులరైజ్ చేసి ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా హోంగార్డు అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు సకినాల సత్యనారాయణ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి విదితమే. అయితే సత్యనారాయణ ఆరోగ్యం విషమించడంతో మంగళవారం వేకువజామున పోలీసులు దీక్షను భగ్నం చేసి ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

 హోంగార్డు మృతి అంటూ వెబ్‌సైట్లలో హల్‌చల్
 హోంగార్డుల దీక్షను భగ్నం చేసిన క్రమంలో ఘటన స్థలంలో ఉన్న తిరుమలగిరి ట్రాఫిక్ హోంగార్డు రమేశ్ అలియాస్ కృష్ణ (25)కు స్వల్ప గాయమైంది. దీంతో రమేశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించి డిశ్చార్జి చేశారు. అయితే రమేష్ ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడనే వార్త సామాజిక వెబ్‌సైట్లలో హల్‌చల్ చేసింది. దీంతో నగరంలోని హోంగార్డులు మంగళవారం ఉదయం పెద్దసంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకున్నారు. వాస్తవం తెలుసుకున్న అనంతరం ధర్నా చేయాలని నిర్ణయించుకుని, ఆస్పత్రి ప్రాంగణంలో బైఠారుుంచారు.  

 ఆస్పత్రి భవనం పెకైక్కిన హోంగార్డులు...
 తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకారులు భాస్కర్‌నాయక్, ఉపేందర్, కుమార్ ఆస్పత్రి ప్రధాన భవనం పెకైక్కి దూకుతామంటూ బెదిరించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను నచ్చజెప్పి కిందికి దించారు. హోంగార్డుల ఆందోళన విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ రెండు రోజుల తర్వాత చర్చలకు రావాలని ఆహ్వానించారు. దీంతో హోంగార్డులు ఆందోళన విరమించారు. మరోవైపు సకినాల సత్యనారాయణ దీక్షను భగ్నం చేసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంతో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆస్పత్రి ఓపీ బ్లాక్ వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రి వద్ద కూడా బలగాలను మోహరించారు. నారాయణకు చికిత్స అందించిన వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. సాయంత్రానికి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో నారాయణను డిశ్చార్జి చేశారు.

Advertisement
Advertisement