హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం

Published Sat, Apr 11 2015 10:03 AM

హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం - Sakshi

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని నగరంలో శనివారం ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీలోని హయత్ నగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, వనస్థలిపురం, మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, బాలానగర్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్సుఖ్నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది. దిల్సుఖ్నగర్తో ఉదయం 6.30 కి మొదలైన వర్షం 8.00 గంటలకు బంజారాహిల్స్ దాకా విస్తిరించింది.

అంతేకాకుండా ఉత్తర కర్ణాటక నుంచి లక్షద్వీప్ వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అదే విధంగా రాయలసీమ, తెలంగాణలో క్యుములోనింబస్ మేఘాలు కదులుతాయని తెలిపారు. అందుచేత అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని కూడా  వారు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడే  అవకాశం ఉందని కూడా వారు చెప్పారు. శనివారం నుంచి రాయలసీమ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయని సమాచారం.

Advertisement
Advertisement