మరో 4 రోజులు వర్షాలు | Sakshi
Sakshi News home page

మరో 4 రోజులు వర్షాలు

Published Sun, May 8 2016 2:08 AM

Rains will be continued for 4 days

సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. ఉరుములు, ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వానలు పడతాయని తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలుంటాయని, క్యుములోనింబస్ మేఘాల కారణంగా సాయంత్రం వేళల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
 
 ఇక గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్‌లో 2 సెంటీమీటర్లు, చిన్నచింతకుంట, మార్పల్లెలో ఒక సెంటీమీటర్ చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో 2.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా  ఉష్ణోగ్రతలు తగ్గాయి. జనం కాస్త సేదతీరుతున్నారు. హన్మకొండలో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
 
 శనివారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం    ఉష్ణోగ్రత
 హన్మకొండ    42.3
 రామగుండం    40.4
 భద్రాచలం    40.0
 నిజామాబాద్    39.4
 ఆదిలాబాద్    38.8
 మెదక్    38.4
 మహబూబ్‌నగర్ 38.3
 ఖమ్మం    38.2
 నల్లగొండ    37.4
 హైదరాబాద్    37.3
 

Advertisement

తప్పక చదవండి

Advertisement