రవితేజ అభిమానుల ఆందోళన | Sakshi
Sakshi News home page

రవితేజ అభిమానుల ఆందోళన

Published Fri, Jul 28 2017 6:32 PM

Ravi Teja Fans protest at Excise Office



హైదరాబాద్‌: ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద హీరో రవితేజ అభిమానులు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. డ్రగ్స్‌ కేసులో విచారణ కోసం ఈ ఉదయం రవితేజ రావడంతో సిట్‌ కార్యాలయానికి భారీగా అభిమానులు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఆయనను సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎనిమిది గంటలుగా విచారణ కొనసాగుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. 9 గంటల విచారణ తర్వాత రాత్రి 7.30 గంటల ప్రాంతంలో విచారణ ముగిసినట్టు సిట్‌ అధికారులు ప్రకటించారు.

ఈరోజు హీరో రవితేజతో పాటు సయ్యద్‌ యూనిస్‌, తాబిక్‌ అహ్మద్‌లను విచారించినట్టు సిట్‌ అధికారులు వెల్లడించారు. రేపు రవితేజ డ్రైవర్‌ శ్రీనివాసరావును ప్రశ్నించనున్నట్టు చెప్పారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పోలీసు ఉన్నతాధికారులు అనురాగ్‌ శర్మ, మహేందర్‌రెడ్డి, అకున్‌ సబర్వాల్‌ భేటీ అయ్యారు. డ్రగ్స్‌ కేసు దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement