ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లు తొలగింపు | Sakshi
Sakshi News home page

ఉద్దేశపూర్వకంగానే ఓటర్ల పేర్లు తొలగింపు

Published Tue, Dec 3 2013 4:43 AM

Removal of names of voters consciously

సాక్షి, హైదరాబాద్: కొందరు నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఉద్దేశపూర్వకంగా ఓటర్ల పేర్లు తొలగించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పుత్తా ప్రతాప్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో 90 వేల ఓటర్లను తొలగించారని, అవి కూడా ఒకే పార్టీని టార్గెట్ చేసి చేపట్టారని చెప్పారు.

ఓటరు కార్డులున్న వేలాది మంది పేర్లు జాబితాలో లేవని వివరించారు. 2009లో ఎల్బీనగర్ నియోజక వర్గంలో 4.12 లక్షల ఓటర్లు, 2011లో 4.45 లక్షల ఓటర్లు, 2013 జూన్ నాటికి 4.85 లక్షల ఓటర్లుండగా... ప్రస్తుతం 3.89 లక్షల ఓటర్లు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. డివిజన్, వార్డు స్థాయి నాయకుల పేర్లు కూడా జాబితాలో లేకపోవడం చూస్తుంటే.. ఒక పార్టీకి చెందిన వారిని కావాలనే తొలగించారన్నది స్పష్టమవుతోందన్నారు. ఇందుకు బాధ్యులైనవారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని భన్వర్‌లాల్‌ను కోరారు.
 
విచారణ చేస్తాం...
 జాబితా నుంచి ఓటర్ల పేర్ల తొలగింపుపై విచారణ జరిపిస్తామని భన్వర్‌లాల్ హామీ ఇచ్చారు. ఓటరు గుర్తింపు కార్డు ఉన్నా.. జాబితాలో పేరు లేకపోతే తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10 వరకూ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చునన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement