బడుగులకు అండ కాంగ్రెస్ ఒక్కటే: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేష న్లు కల్పిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం గాం ధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావే శం జరిగింది. ఏఐసీసీ కార్యదర్శిగా నియుక్తుౖ లెన మధుయాష్కీని అంతకుముందు సన్మా నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్.సి.కుంతియా, సభ్యత్వ నమో దు బాధ్యుడు సి.జె.శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి పని చేసేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనన్నారు.
మధు యాష్కీ మాట్లాడుతూ కాంగ్రెస్ సామాజిక న్యాయం చేస్తుంటే, బీజేపీ సమాజాన్ని చీల్చుతోందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దొరల పాలన చేస్తున్నారని, ఒక కులానికే ప్రాధా న్యం దక్కుతున్నదని ఆరోపించారు. తనపై నమ్మకంతో కర్ణాటక బాధ్యతలు కూడా అప్ప గించిన ఏఐసీసీకి ఆయన కృతజ్ఞతలు తెలిపా రు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసేవారికి తగిన గౌరవం దక్కుతుందనడానికి యాష్కీ నియా మకమే నిదర్శనమన్నారు. పార్టీ నేతలు డి.కె.అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 లోగా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని ఉత్తమ్ సూచించారు.