Sakshi News home page

రిబాక్ కు బదులు బాటా షూ వేసుకున్నాడని..

Published Wed, Nov 30 2016 11:23 AM

Restrictions in Global Indian School at uppal

హైదరాబాద్: ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాల చేష్టలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. తరగతులు మొదలైనప్పటి నుంచే అడ్డదిడ్డమైన నిబంధనలు విధిస్తూ.. మా వద్దే పుస్తకాలు కొనుగోలు చేయాలి, మేమే స్కూల్ యూనిఫాం అందిస్తామని చెప్పి బలవంతపు కొనుగోళ్లకు పాల్పడుతుంటాయి. తాజాగా ఓ ప్రైవేట్ విద్యాసంస్థ మరింత దిగజారుడు చర్యలకు పాల్పడింది. తాము సూచించిన కంపెనీ షూస్ కాకుండా.. వేరే షూస్ వేసుకొచ్చాడనే నెపంతో విద్యార్థిని పాఠశాలలోకి అనుమతించలేదు. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్‌లో బుధవారం వెలుగుచూసింది. 
 
వివరాలు.. ఉప్పల్‌లోని గ్లోబల్ ఇండియన్ స్కూల్‌కు చెందిన ఓ విద్యార్థిని పాఠశాల సిబ్బంది తిరిగి ఇంటికి పంపారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని తమ కుమారుడిని వెనక్కి ఎందుకు పంపారని యాజమాన్యాన్ని నిలదీశారు. దానికి పాఠశాల యాజమాన్యం నుంచి వచ్చిన సమాధానం విని తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. తాము సూచించిన రిబాక్ షూస్ కాకుండా.. బాటా షూతో పాఠశాలకు వచ్చాడని ఆ కారణంతోనే రానివ్వలేదని పాఠశాల సిబ్బంది చెప్పారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు ఇలాంటి ఆంక్షలు పెడుతున్న స్కూల్  పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement