టీడీపీ పుట్టింది తెలంగాణలోనే: రేవంత్ | Sakshi
Sakshi News home page

టీడీపీ పుట్టింది తెలంగాణలోనే: రేవంత్

Published Tue, Nov 1 2016 2:41 AM

టీడీపీ పుట్టింది తెలంగాణలోనే: రేవంత్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం హైదరాబాద్‌లోనే పుట్టిందని, తెలంగాణకు పరాయి పార్టీ కాదని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటిదాకా అమలు చేయలేదన్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవల్లి, నర్సక్కపేట గ్రామాలను చూపిస్తూ ఆ రెండు గ్రామాలకు సర్పంచులాగా పనిచేస్తున్నాడని విమర్శించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 20 టికెట్లు సీమాంధ్రవారికే ఇచ్చారని, అక్కడ తెలంగాణ పేదలు లేరా అని ప్రశ్నిం చారు. మంత్రి కేటీఆర్ చుట్టూ ఆంధ్రావాళ్లే ఉంటారన్నారు. ఎందరో విద్యార్థి, యువకుల ప్రాణత్యాగాలతో వచ్చిన తెలంగాణను కేసీఆర్ కుటుంబం పీల్చి పిప్పిచేస్తున్నదన్నారు.   

Advertisement
Advertisement