'సింగం వస్తుందని తెలిసి చైనా పారిపోయాడు' | Sakshi
Sakshi News home page

'సింగం వస్తుందని తెలిసి చైనా పారిపోయాడు'

Published Wed, Sep 9 2015 1:50 PM

'సింగం వస్తుందని తెలిసి చైనా పారిపోయాడు' - Sakshi

హైదరాబాద్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి...టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  బెయిల్ షరతుల సడలింపులతో హైదరాబాద్ వచ్చిన ఆయన బుధవారం ఎల్బీ నగర్లో మాట్లాడుతూ...'  బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్...తాగుబోతు తెలంగాణ చేశారు. ఆట కాదు వేట మొదలైంది. టీడీపీ ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ కమిషనర్ తొలగిస్తున్నారు. ఆయన కమిషనర్గా కాకుండా టీఆర్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు.

మేం పిలుపునిస్తే ఒక్కే ఒక్క గంటలో హైదరాబాద్లో  టీఆర్ఎస్ జెండాలనేవి లేకుండా చేస్తాం. ఆ సత్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీని ఖాళీ చేస్తామని...అది ఆయన తరం కాదు.  మా పార్టీ ఏం మందు సీసా కాదు...రాత్రి తాగితే తెల్లారికి ఖాళీ అయిపోవడానికి. ఆయనే చైనా పోయిండు. నాకు బెయిల్ వచ్చినప్పుడు మా మిత్రులు అన్నారు... రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది....కేసీఆర్కు జ్వరం వచ్చిందని, ఇప్పుడూ కూడా అదే చేశాడు.

సింగం సింగిల్గా హైదరాబాద్ వస్తుందని తెలిసి... కేసీఆర్  పిరికి పందలా ప్రత్యేక విమానం వేసుకుని చైనాకు పారిపోయాడు. మా అడ్డా ఇక్కడనే...ఇక్కడే ఉంటాం. కేసీఆర్ దొర కాదు...ఓ అరాచకవాది. ఆయన రాక్షసానందం పొందే వ్యక్తి.  ప్రత్యేక  తెలంగాణ కోసం విద్యార్థులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పుంటించుకుని బలిదానం చేసుకున్నారు. 

వాళ్ల త్యాగాన్ని కేసీఆర్ మర్చిపోయాడు. తెలంగాణ వచ్చింది కాబట్టి...ఇప్పుడు రైతులపై పడ్డాడు. అప్పుల బాధతో రైతులు కాలిపోతున్నారు. రైతులు ఉరి వేసుకుని ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ఆయన మాత్రం పెరుగన్నం తిని ఫామ్హౌస్లో రెస్ట్ తీసుకుంటున్నాడు. 100 ఎకరాల ఫామ్హౌస్పై వందసార్లు సమీక్ష చేస్తున్న కేసీఆర్ రైతుల ఆత్మహత్యలపై ఎందుకు ఆలోచించట్లేదు. పెట్టుబడుల కోసం చైనా పర్యటనకు వెళ్లిన కేసీఆర్ ఆర్థికమంత్రిని ఎందుకు తీసుకు వెళ్లలేదు' అని ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement