'గడప గడపకు వైఎస్‌ఆర్‌' కార్యక్రమంపై సమీక్ష | Sakshi
Sakshi News home page

'గడప గడపకు వైఎస్‌ఆర్‌' కార్యక్రమంపై సమీక్ష

Published Wed, Aug 17 2016 12:10 PM

Review meeting on Gadapaku gadapaku ysr programe

హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన 'గడప గడపకు వైఎస్‌ఆర్‌' కార్యక్రమంపై సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. ఈ సమీక్షా సమావేశానికి 13 జిల్లాలకు చెందిన కో ఆర్డినేటర్లు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు తదితరులు హాజరయ్యారు.

కాగా, వైఎస్‌ఆర్‌సీపీలో బొబ్బిలికి చెందిన ప్రముఖ వైద్యుడు పోలా అజయ్‌, విజయనగరం మాజీ జెడ్పీ ఛైర్మన్‌ వాకాడ నాగేశ్వరరావులు బుధవారం పార్టీ కేంద్ర కార్యాయలంలో వైఎస్‌ జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నేతలిద్దరూ పార్టీలో చేరారు.

Advertisement
Advertisement