టైగర్‌ నిఖిల్‌ పరిస్థితి విషమం | Sakshi
Sakshi News home page

టైగర్‌ నిఖిల్‌ పరిస్థితి విషమం

Published Tue, Feb 21 2017 1:13 PM

టైగర్‌ నిఖిల్‌ పరిస్థితి విషమం

- జూపార్కులో వరుసగా మృతి చెందుతున్న వన్యప్రాణులు
 
హైదరాబాద్‌: నెహ్రూ జూలాజికల్‌ పార్కులోని రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ (నిఖిల్‌–18) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని జూపార్కు క్యూరేటర్‌ శివానీడోగ్రా తెలిపారు. జూపార్కులో 1999 అక్టోబర్‌ 8న జన్మించిన నిఖిల్‌ రెండు నెలల నుంచి నిమోనియా వ్యాధితో బాధపడుతుందన్నారు. జూపార్కు విశ్రాంత డాక్టర్‌ నవీన్‌ కుమార్‌ పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్సలు అందిస్తున్నామని తెలి పారు. వారం రోజుల నుంచి వైద్యానికి నిఖిల్‌ శరీరం స్పందించడం లేదని అన్నారు.  కొన్ని నెలల నుంచి జూపార్కులో వరుసగా అదురైన వన్యప్రాణులు మృతి చెందుతున్నాయి.
 
వృద్ధాప్యంతో నీటి గుర్రం మృతి చెందగా... వ్యాధులతో చిరుతపులి, అడవి దున్న మృతి చెందాయి. జూపార్కులో ప్రతి ఏడాది 100కు పైగా కొత్త వన్యప్రాణులు జీవం పోసుకుంటున్నాయని చెప్పుకుంటున్న జూ అధికారులు వృద్ధాప్యంతో ఉన్న వన్యప్రాణుల వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. తరుచూ వన్యప్రాణులు వ్యాధులతో మృతి చెందితే వృద్ధాప్యం కారణమంటూ పేర్కొంటున్నారు.  
 

Advertisement
Advertisement