ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చేది రూ.189 కోట్లే | Sakshi
Sakshi News home page

ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చేది రూ.189 కోట్లే

Published Wed, May 18 2016 1:08 AM

Rs .189 crore from Delhi to AP

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ప్రధానమంత్రి  ఎదుట అట్టహాసంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా కేంద్రం మాత్రం నామమాత్రంగానే స్పందించింది. రాష్ట్రానికి కరవు సహాయక చర్యల కింద ఇవ్వాల్సిన బకాయిలను మాత్రం ఇస్తామని అధికారులు తేల్చిచెప్పారు. కరవు సహాయక చర్యల కోసం రాష్ట్రం 2 వేల కోట్ల రూపాయలను కోరింది.

కేంద్రం 430 కోట్ల రూపాయలను మంజూరు చేసి 317 కోట్లను విడుదల చేసింది. ఇంకా 113 కోట్లను ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు గత ఏడాది వచ్చిన వరద సాయం కింద కేంద్రం ప్రకటించిన 280 కోట్లలో 204 కోట్లను ఇప్పటి వరకు ఇచ్చింది. ఇంకా 76 కోట్లను ఇవ్వాల్సి ఉంది. ఈ రెండు మొత్తాలు కలిపి రాష్ట్రానికి 189 కోట్ల దాకా రావాల్సి ఉంది. ఆ మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామన్న హామీ తప్ప రాష్ట్రంలో కరవు చర్యలకు తక్షణ సాయం కింద కొత్తగా ఎటువంటి నిధులను కేంద్రం ప్రకటించలేదు.

Advertisement
Advertisement