Sakshi News home page

నీళ్లలో పడి రూపం కోల్పోయిన రూ. 500 నోటు

Published Fri, Dec 2 2016 9:41 AM

నీళ్లలో పడి రూపం కోల్పోయిన రూ. 500 నోటు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల నాణ్యతను పరీక్షించే పనిలో కొందరు బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రూ.2000 నోటుపై వివిధ రకాలుగా పరీక్షలు చేసిన వీడియోలు ఆన్‌ లైన్‌ లో సంచలనం చేశాయి. కొత్త నోటు నలుగుతుందా, వాటర్ ప్రూఫా, కాదా అని పరీక్షించారు. రూ. 2000 నోటును నీటిలో ముంచి పరీక్షించారు. తడిసిన నోటు రంగు వెలిసిపోలేదు. దీంతో నోటు తడిసిన ఇబ్బందులు లేవని తేల్చారు. యూట్యూబ్‌ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించిన విషయం తెలిసిందే.

ఇక పరీక్షలకు కొత్త రూ.500 నోటు వంతు వచ్చింది. కానీ ఈ సారి పరీక్ష కావాలని చేయకపోయిన ప్రమాదవశాత్తు జరిగింది. శంకరమఠం ఏరియా వాసి, హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్‌ గురువారం ఏటీఎం నుంచి  డ్రా చేసిన రూ. 500 నోటు చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును నీళ్లలోంచి తీసి..తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టారు. ఐదు నిమిషాలు తరువాత చూడగా  ఆ నోటు రంగు వెలిసి నోటు ఆనవాళ్లు కోల్పోయింది. నోటులోని జాతిపిత గాంధీ బొమ్మతో పాటు ఇతర అక్షరాలు రూపం కోల్పోపోయాయి. దీంతో ఖంగుతిన్న అతను నోటు అసలా. నకిలీదా అని ఆందోళన చెందాడు. కానీ, కొన్ని చోట్ల వేడి నీటిలో పరీక్షించినా నోటుకు ఏమీ కాలేదు. కొత్త రూ.500 నోటును పరీక్షించకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement